హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్దం అవుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన హస్తినకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పేరుకు అధికారిక సమావేశం కోసం హస్తిన పర్యటన ఉన్నా అందరి అంచనాలు మాత్రం మంత్రివర్గంలో మార్పు చేర్పుల చుట్టే తిరుగుతున్నాయి. ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డిల తొలగింపు తర్వాత ఇంకా వేట్లు ఉంటాయా? కొత్తగా మంత్రివర్గంలో ఎవరైనా చేరుతారా.. లేదంటే అసెంబ్లీ సమావేశాలపేరుతో మరికొంత కాలం సాగతీస్తారా తేలాల్సిఉంది.
0 comments:
Post a Comment