హైదరాబాద్ : మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 90వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. ఆయన మంగళశారం ఉదయం సతీసమేతంగా ఘాట్‌కు చేరుకుని తాతకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ మళ్లీ జన్మలోనూ ఎన్టీఆర్ కుటుంబంలోనే పుట్టాలని కోరుకుంటున్నానని అన్నారు.
మహానాడుకు ఆహ్వానం అందలేదని...... అందితే... హాజరవుతానని ఎన్టీఆర్ తెలిపారు. 2014 టిడిపి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. టిడిపి కోరితే ప్రచారం చేయటానికి సిద్ధంగా వున్నానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. తెలుగుజాతి బతికున్నంత కాలం మర్చిపోలేని నేత ఎన్టీఆర్ అని, భౌతికంగా లేకున్నా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

0 comments:
Post a Comment