హైదరాబాద్: ప్రజల పక్షాన నిలబడినందుకే తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి అన్నారు. తమ కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. వైఎస్ జగన్ నిర్బంధాన్ని నిరసిస్తూ నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కొవ్వొత్తు ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... అరెస్టయిన వ్యక్తికి చట్టం ప్రకారం 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలని, కానీ జగన్ ను అరెస్ట్ చేసి ఏడాది పూర్తయినా బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు మొదలు పెట్టి రెండేళ్లవుతున్నా జగన్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా సంపాదించలేదని భారతి అన్నారు. విచారణ చేయకుండానే జగన్ ను మొదటి ముద్దాయిగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. ఒక ప్రశ్న అడగకుండానే మూడు చార్జిషీట్లు వేశారన్నారు.
ప్రజలతో ఉండాలనుకోవడమే తాము చేసిన తప్పా అని ఆమె ప్రశ్నించారు. జైల్లో ఉన్న జగన్ ఎంతో ధైర్యంగా ఉన్నారని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడివుంటానని చెప్పారన్నారు.

0 comments:
Post a Comment