Monday, 27 May 2013

పాలకొల్లులో నేడు YSషర్మిల నిరసన దీక్ష

పాలకొల్లు, న్యూస్‌లైన్ : జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి ఏడాది దాటిన నేపథ్యంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన సోదరి షర్మిల మంగళవారం పాలకొల్లులో నిరసన దీక్ష చేపట్టనున్నారు.

జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆమె పాలకొల్లులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దీక్షలో పాల్గొంటారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మె ల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, అల్లు వెంకట సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డు వద్ద ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. షర్మిలతోపాటు జిల్లాలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా దీక్షలో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం దీక్ష విరమించడానికి ముందు ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడతారని పేర్కొన్నారు.

0 comments:

Post a Comment