హైదరాబాద్: వైఎస్ జగన్ నిర్బంధాన్ని నిరసిస్తూ నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కొవ్వొత్తు ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు. జగన్ కు మద్దతుగా భారీగా వచ్చిన జనంతో నెక్లెస్‌రోడ్ అభిమాన సంద్రంగా మారింది.
పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, విజయారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. వేదిక దగ్గరకు వచ్చిన జగన్ కుటుంబ సభ్యులను అభిమానులు చుట్టుముట్టారు. కాసేపట్లో ర్యాలీ ప్రారంభమవుతుంది.

0 comments:
Post a Comment