తనను చంద్రబాబు దూరంగా పెట్టారని ,అందువల్లనే తాను పార్టీని వదలుతున్నానని టిడిపికి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు చెప్పారు. గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, చిరంజీవి వంటి నేతలు తనను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని, అయినా తాను వెళ్లలేదని, కాని తప్పనిపరిస్థితి లోనే పార్టీ మారాలన్న నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తాను జగన్ ను శనివారం ఉదయం కలుస్తున్నానని,ఆ సందర్భంగా పార్టీ విదానాలు గురించి స్పష్టమైన ప్రశ్నలు వేస్తానని, ఆయన నుంచి జవాబు సంతృప్తికరంగానే ఉంటేనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరతానని, లేకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని దాడి స్పష్టం చేశారు.కొన్ని విషయాలను కార్యకర్తలందరికి చెప్పడం సాధ్యం కాదని ఆయన అన్నారు.పార్టీ మారడం కొందరికి కార్యకర్తలకు ఇష్టం ఉండకపోవచ్చని,కాని వాస్తవ పరిస్థితులు తెలిశాక అందరూ ఒప్పుకుంటారని అన్నారు.
0 comments:
Post a Comment