ఖమ్మం: చంద్రబాబు అండతోనే సీఎం కిరణ్ విర్రవీగుతున్నారని ఖమ్మం జిల్లా జూలూరుపాడులో జరిగిన బహిరంగసభలో షర్మిల మండిపడ్డారు. చంద్రబాబును నాయకుడు కాదు దుర్మార్గుడు అనాలని షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మామను వెన్నుపోటు పొడిచారు.. నేడు ప్రజలను వెన్నుపోటు పొడిచారు అని షర్మిల అన్నారు. అన్ని ఛార్జీలు పెంచుతూ కిరణ్ సర్కారు ప్రజలపై అదనపు భారం మోపుతోందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని షర్మిల తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ దుర్మార్గాలను బయటపెడతారనే జగనన్నను జైలుకు పంపారని ఆమె అన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్‌ఆర్ ఎంతో కృషి చేశారని షర్మిల గుర్తు చేశారు.
0 comments:
Post a Comment