రాజకీయాలలో కావాలని జరగకపోయినా, అది ఒక్కోసారి ఇబ్బంది సృష్టిస్తుంది.తెలంగాణ రాష్ట్ర సమితిలో కొత్తగా చేరిన కాంగ్రెస్ ఎమ్.పిలు మందా జగన్నాధం,వివేక్ లకు నిజాం కాలేజీ మైదానంలో జరిగిన సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం విమర్శలకు దారి తీసింది. వర్షం తదితర కారణాలు ఎలా ఉన్నా వారిద్దిరికి కొద్ది సేపైనా అవకాశం ఇచ్చి ఉంటే విమర్శలకు ఆస్కారం ఉండేది కాదు. అప్పుడు కారణం ఏమైనా వారు మాట్లాడకపోవడంతో ప్రత్యర్ధి పార్టీలు ఆ పాయింటు మీద కెసిఆర్ పై విమర్శలకు దిగుతున్నాయి.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెబుతున్న కెసిఆర్ కనీసం సభలో వారిని మాట్లాడనివ్వలేదని ఎద్దేవ చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు,ప్రభాకర్ లు కెసిఆర్ పై విమర్శలు చేస్తూ ఓట్లు,నోట్లు,సీట్లు తప్ప కెసిఆర్ కే వేరే పని లేదని కూడా ధ్వజమెత్తారు. దళిత ఎమ్.పిలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నించారు. కొంతకాలం పాటు కెసిఆర్ కు ఇది చికాకుగా ఉండే అవకాశం ఉంది.వసూళ్లలో కెసిఆర్ బిజిగా ఉంటున్నారని వారు ఆరోపించారు.
0 comments:
Post a Comment