భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాద్ సింగ్ చేసిన ఒక ప్రకటన ఆసక్తికరంగా ఉంది. సీనియర్ నాయకుడు నాగం జనార్ధనరెడ్డి బిజెపిలో చేరిన సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ను వ్యతిరేకించే పార్టీలతో కలవబోమని ఆయన అన్నారు. అంటే రాష్ట్రంలో పార్టీలా?లేక జాతీయ స్థాయిలోని పార్టీలతోనే అన్నది స్పష్టత లేదు.రాష్ట్రంలో బిజెపితో కలవడానికి ఏ పార్టీ సిద్దంగా లేదు. తెలంగాణ సాధన కోసమే పుట్టిన టిఆర్ఎస్ కూడా బిజెపిని అంటరాని పార్టీగానే ప్రస్తుతం ఎన్నికల నేపధ్యంలో చూస్తోంది. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కూడా బిజెపితో పొత్తు లేదని అన్నారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మొదటి నుంచి అదే పంధాలో ఉంది.ఇక జాతీయ స్థాయిలో కూడా అదే వైఖరి తీసుకుంటుందా అన్నది చర్చనీయాంశం.శివసేన తెలంగాణ ఏర్పాటుకు అంత అనుకూలం కాదు. మహారాష్ట్రలో విదర్భ రాష్ట్ర ఏర్పాటును వారు వ్యతిరేకిస్తున్నారు.మరి అలాంటప్పుడు శివసేనతో కలవకుండా ఉండగలరా అన్నది ప్రశ్నార్ధకం.కాగా కాంగ్రెస్ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని, లేకుంటే బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని రాజ్ నాద్ సింగ్ చెబుతున్నారు.తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశలో భాగంగా రాజ్ నాద్ సింగ్ గట్టి ప్రకటనలే చేస్తున్నారు.
0 comments:
Post a Comment