Monday, 3 June 2013

జగ్గారెడ్డి ఆ విషయం ఒప్పుకున్నట్లే కదా!

మొత్తం మీద విప్ జగ్గారెడ్డి ఒక మాట ఒప్పుకున్నారు.కెసిఆర్ పై విమర్శలు చేస్తూనే ప్రజలు ఆయన మాటలను నమ్ముతున్నారన్న అభిప్రాయాన్ని పరోక్షంగా చెప్పారు.కెసిఆర్ మాయ మాటలు చెప్పి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన అన్నారు.అందులో ఆయన సఫలం అవుతున్నారని కూడా జగ్గారెడ్డి అనడం విశేషం. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజల బతుకులతో ఆడుకుంటున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే తూరుపు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి)విమర్శించారు. అందులో అతను సక్సెస్ కూడా అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎల్ పి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కెసిఆర్ ఇష్టానుసారం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించడం
కెసిఆర్ కు తగదన్నారు.తెలంగాణ అబివృద్దికి ఆయా ముఖ్యమంత్రులు ఎంతో కృషి చేశారని,కిరణ్ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని ఆయన చెప్పారు. కెసిఆర్ ముఖ్యమంత్రిపై విరుచుకుపడిన తీరుపై ఈయన మాట్లాడుతూనే జనంలో పట్టు ఉన్న విషయాన్ని కూడా ఒప్పుకుంటున్నట్లే కదా!

0 comments:

Post a Comment