Sunday, 5 May 2013

ఎన్ టీ ఆర్ ఛానల్ నీ కొంటున్న కాంగ్రెస్ పార్టీ

కర్ణాటక ఎన్నికలకు ఎన్ టీ ఆర్ స్టూడియో ఎన్ చేతులు మారటానికీ మధ్య సంబంధం ఉందంటున్నారు. కర్ణాటక లో కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ ముఖ్య నాయకులు ఈ ఛానల్ తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. నిజానికి రెండు నెలల కిందటి బేరసారాలు సాగినా, ఎన్నికల ఖర్చులుంటాయన్న ఉద్దేశంతో వాయిదా వేసుకన్నారట. ఆ నాయకుల తరపున వారికి సన్నిహితుడైన వ్యక్తి మధ్యవర్తిత్వం నెరపడం, ఛానల్ కార్యాలయాన్ని పరిశీలించి వెళ్ళటంతో బాటు ధర కుడా ఖాయమైoదని చెబుతున్నారు. పార్టీ గెలుపును బట్టి నిర్ణయం ఉంటుందని చెబుతున్నప్పటికీ, అమ్మకం విషయం లో ఇప్పుడు స్టూడియో ఎన్ ఆధిపతి మనసులో ఏమున్నదో వాళ్లకి తెలియకపోవచ్చు. ఏది ఏమైనా, ఫలితాలు వెలువడిన రెండు మూడు రోజుల్లోనే ఈ వ్యవహారం ఒక కొలిక్కి రావచ్చు. 

గేట్లు తెరిస్తే మిగిలేది బాబు, లోకేషే: గండ్ర వెంకటరమణారెడ్డి

హైదరాబాద్: తెలుగుదేశం కాలం చెల్లిన పార్టీగా మిగిలిపోయిందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. ఆ పార్టీ గేట్లు తెరిస్తే చంద్రబాబు, లోకేష్ మినహా ఒక్కరు కూడా మిగిలే పరిస్థితి లేదన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం గండ్ర మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాదయాత్ర వృథా ప్రయాసగా మారిందన్నారు. టీడీపీ నుంచి వెళ్లిపోతున్న వారి సంఖ్యే అందుకు నిదర్శనమన్నారు. చిరంజీవి సారథ్యంలో రాష్ట్రం బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారంటూ మంత్రి రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. 

మళ్లీ అధికార ప్రతినిధిగా ఎంపీ రేణుకా చౌదరి

న్యూఢిల్లీ: ఏఐసీసీలో అధికార ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ చెందిన రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరికి మరో అవకాశమిచ్చారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ వాణిని మరింత సమర్థవంతంగా వినిపించేందుకు చేస్తున్న యత్నాల్లో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమెకు ఈ అవకాశం ఇచ్చినట్టు సమాచారం. రేణుక సహా మరో 8 మందిని కూడా ఏఐసీసీ ప్రతినిధులుగా నియమించారు. వీరి నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా విభాగం ఇంచార్జి జనార్దన్ ద్వివేది ఆదివారం ఇక్కడ వెల్లడించారు. పీసీ చాకో, సందీప్‌లు పాతవారే కాగా, కొత్తగా వచ్చిన వారిలో మోహన్ ప్రకాష్, షకీల్ అహ్మద్, భక్తచరణ్ దాస్, రాజ్ బబ్బర్, మీన్ అఫ్జల్ ఉన్నారు. గతంలో పార్టీ అధికార ప్రతినిధుల బృందంలో క్రియాశీల పాత్ర వహించిన మనీష్ తివారీ కేంద్ర కేబినెట్‌లో చేరినప్పటినుంచీ రేణుక, చాకో, సందీప్, రషీద్ అల్వీతో నెట్టుకొస్తున్న కాంగ్రెస్ నాయకత్వం ఎట్టకేలకు బృందం సభ్యుల సంఖ్యను పెంచింది. కాగా, రషీద్ అల్వీని ఈ పదవి నుంచి తప్పించారు. 

ఓటు వేయగానే రశీదు! కొత్త పద్దతి


న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం)ల ద్వారా వేసిన ఓటు తాము ఎంచుకున్న అభ్యర్థికే పడిందా లేదా అనే విషయాన్ని ఓటర్లు ఇకపై స్వయంగా తెలుసుకోవచ్చు. ఎన్నికల సంఘం కొత్తగా తయారుచేయించిన ‘ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్(వీవీపీఏటీ)’ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఇది సాకారం అవుతుంది. ఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా బీజేపీ పలు సందేహాలు వ్యక్తంచేసిన నేపథ్యంలో వీవీపీఏటీ రూపకల్పనకు ఈసీ శ్రీకారం చుట్టింది. ఇది అమల్లోకి వస్తే ఓటరు తన ఓటు వేసిన వెంటనే ఏ అభ్యర్థికి ఆ ఓటు పడిందో అతడి పేరు, పార్టీ తదితర వివరాలతో కూడిన రశీదు వస్తుంది. ఓటరు ఆ రశీదు చూసి, తన ఓటు సరిగా పడిందో లేదో పరిశీలించుకోవచ్చు. అయితే ఎన్నికల ప్రక్రియ రహస్యంగా ఉంచేందుకుగాను ఆ రశీదును ఇంటికి పట్టుకెళ్లడానికి అనుమతించరు. ఈ కొత్త విధానంపై చర్చించి.. సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఎన్నికల సంఘం ఈనెల 10న రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. ఇందుకోసం ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులకు ఆహ్వానం పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

కొత్త విధానం కోసం 250 ప్రింటర్లకు ఆర్డర్ ఇచ్చామని, అవి జూన్ మొదటివారంలో వస్తాయని, అనంతరం వాటిని ఈవీఎంలకు అమర్చి, ఏదైనా ఉప ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని తెలిపాయి. అయితే ఈ కొత్త విధానాన్ని 2014 సాధారణ ఎన్నికల్లో అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నాయి. సాధారణ ఎన్నికల్లో దీనిని అమలు చేయాలంటే దాదాపు 13 లక్షల యంత్రాలు అవసరమవుతాయని, ఇందుకు దాదాపు రూ.1,700 కోట్లు వ్యయం అవుతుందని వివరించాయి. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు ఈనెల 10న రాజకీయ పార్టీలతో సమావేశమవుతున్నట్టు తెలిపాయి. కొత్త విధానం పట్ల బీజేపీ అనుకూలంగా ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనే దీనిని ప్రవేశపెట్టాలని ఈసీని కోరుతున్నట్టు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. కాంగ్రెస్ కూడా ఈ విధానం పట్ల సుముఖంగానే ఉన్నప్పటికీ, దాని పనితీరు పరిశీలించిన తర్వాతే తమ అభిప్రాయం చెబుతామని పేర్కొంది. జేడీ(యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. 

సీఎం కిరణ్ వసూల్ రాజా: YS షర్మిల


కొత్తగూడెం: రాష్ట్రంలో ప్రజలపై అన్ని రకాల ఛార్జీలను పెంచి సీఎం కిరణ్ వసూల్‌ రాజాగా పేరు తెచ్చుకున్నారని కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల ఆరోపించారు. ప్రజలపై భారాన్ని మోపుతున్న కిరణ్‌ సర్కార్‌ను కాపాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చరిత్ర హీనుడిగా మారారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి మంత్రి పదవి కోసం పార్టీని కాంగ్రెస్‌కు అమ్మితే...చంద్రబాబు ఐఎంజీ, ఎమ్మార్‌ కేసుల భయంతో అధికార పార్టీకి అమ్ముడుపోయాడని షర్మిల విమర్శించారు.

కేంద్రంలో బొగ్గుకుంభకోణంలో ప్రధానికి సంబంధంలేదని ఛార్జిషీట్‌లో ఉన్న మంత్రులదే బాధ్యత అంటున్న కాంగ్రెస్... రాష్ట్రంలో మాత్రం మంత్రుల పేరు ఛార్జిషీట్‌లో ఉన్నా వారికి ఎలాంటి సంబందం లేదని.. అప్పటి సీఎం వైఎస్‌దే బాధ్యత అని చెప్పడం కాంగ్రెస్ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.

కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి పదివేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని వైఎస్‌ తన హయాంలోనే 70శాతం పనులు పూర్తిచేస్తే...నేడు కిరణ్ సర్కార్ నాలుగేళ్లలో 30 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిందని మండిపడ్డారు. కొత్తగూడెం పట్టణానికి మంచినీరు ఇవ్వాలని కిన్నెరసాని నుంచి వైఎస్ సంకల్పిస్తే.. నేటి పాలకులు మంచినీరును సక్రమంగా అందించలేకపోతున్నారని షర్మిల మండిపడ్డారు.

జగనన్న సీఎం అయితే కొత్తగూడెంలో భూముల క్రమబద్దీకరణకోసం అర్హులైన ప్రతిఒక్కరికి అండగా నిలుస్తారని, సింగరేణి కార్మికులకు ఫించన్లు, ఇళ్లు, వారి పిల్లలకు చదువుల కోసం కృషిచేస్తారని షర్మిల భరోసానిచ్చారు.

వదంతుల్ని ఖండించిన కొణతాల!

విశాఖపట్నం: కొణతాల రామకృష్ణ పార్టీ మారతారన్న వదంతుల్ని ఖండిస్తున్నామని కొణతాల లక్ష్మినారాయణ అన్నారు. వైఎస్‌ విధేయులుగా కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి ప్రతిఒక్కరం కృషి చేస్తామని లక్ష్మినారాయణ అన్నారు. కార్యకర్తలెవరూ ఆధైర్యపడొద్దని కొణతాల లక్ష్మినారాయణ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లిలో ఆదివారం వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. 

YS Vijayamma speech in YSRCONGRESSPARTY Mahila Sadassu: Video

YS షర్మిల పాదయాత్రకు పోటెత్తిన జనం!

ఖమ్మం: కొత్తగూడెం షర్మిల పాదయాత్రకు జనం పోటెత్తారు. ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొత్తగూడెంకు చేరుకుంది. కొత్తగూడెంలో షర్మిలకు ప్రజలు నీరాజనం పట్టారు. పాదయాత్రలో జగన్‌ నినాదాలతో కొత్తగూడెం హోరెత్తుతోంది. 

వై.ఎస్. రాజశేఖరరెడ్డి 6గురు మహిళలను మంత్రుల్ని చేశారు

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆరుగురు మహిళలకు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా హొం శాఖను కూడా మహిళకే అప్పగించారని ఆమె అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే మహిళలకు అండగా ఉంటారని విజయమ్మ ప్రకటించారు.రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలకు భద్రతలేదని ఆమె అన్నారు.. మద్యం అమ్మకాలు పెరిగిపోవడంతో మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.బాపట్లలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మహిళ నగారా లో ఆమె ప్రసంగించారు. మహిళలను ఆయన అక్కయ్యా, చెల్లెమ్మ అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారని ఆమె తలచుకున్నారు.ఫీజురీయింబర్స్ మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో ఆడపిల్లలు కూడా ఉన్నత చదువుకున్నారని విజయమ్మ పేర్కొన్నారు.

'సీఎం కిరణ్ కుర్చీ కాపాడుకోవడానికే సరిపోతోంది'

అనంతపురం: సీఎం కిరణ్‌ తన కుర్చీ కాపాడుకునేందుకే సమయం సరిపోతుందని కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కిరణ్ పాలనపై దృష్టి పెట్టడం లేదని.. అందుకే రాష్ట్రంలో అనేక సమస్యలు తలెత్తాయన్నారు. కిరణ్ పాలనలో ప్రజలు, రైతులు, కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.