Sunday, 5 May 2013

మళ్లీ అధికార ప్రతినిధిగా ఎంపీ రేణుకా చౌదరి

న్యూఢిల్లీ: ఏఐసీసీలో అధికార ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ చెందిన రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరికి మరో అవకాశమిచ్చారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ వాణిని మరింత సమర్థవంతంగా వినిపించేందుకు చేస్తున్న యత్నాల్లో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమెకు ఈ అవకాశం ఇచ్చినట్టు సమాచారం. రేణుక సహా మరో 8 మందిని కూడా ఏఐసీసీ ప్రతినిధులుగా నియమించారు. వీరి నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా విభాగం ఇంచార్జి జనార్దన్ ద్వివేది ఆదివారం ఇక్కడ వెల్లడించారు. పీసీ చాకో, సందీప్‌లు పాతవారే కాగా, కొత్తగా వచ్చిన వారిలో మోహన్ ప్రకాష్, షకీల్ అహ్మద్, భక్తచరణ్ దాస్, రాజ్ బబ్బర్, మీన్ అఫ్జల్ ఉన్నారు. గతంలో పార్టీ అధికార ప్రతినిధుల బృందంలో క్రియాశీల పాత్ర వహించిన మనీష్ తివారీ కేంద్ర కేబినెట్‌లో చేరినప్పటినుంచీ రేణుక, చాకో, సందీప్, రషీద్ అల్వీతో నెట్టుకొస్తున్న కాంగ్రెస్ నాయకత్వం ఎట్టకేలకు బృందం సభ్యుల సంఖ్యను పెంచింది. కాగా, రషీద్ అల్వీని ఈ పదవి నుంచి తప్పించారు. 

0 comments:

Post a Comment