తాడిపత్రి (అనంతపురం జిల్లా), 28 ఏప్రిల్ 2013: రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్‌కి పార్టీలో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డితోనే రాజన్న రాజ్యం సాధ్యం అని ప్రజలు విశ్వసిస్తున్నారు. దీనితో అనేక మంది స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని చిత్రచేడు, మొలకతాళ్ల, గోపురాజపల్లి, రాంపురం గ్రామాల్లోని 500 కుటుంబాల వారు ఆదివారంనాడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. చిత్రచేడులో జరిగిన కార్యక్రమంలో కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.
వరంగల్‌లో 200 మంది చేరిక :
వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజా వెంకన్న నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
విశాఖపట్నంలో 100 మంది టిడిపి కార్యకర్తలు చేరిక :
విశాఖపట్నం జిల్లా ఆనందపురానికి చెందిన 100 మంది టిడిపి కార్యకర్తలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోరాడ రాజబాబు సమక్షంలో వారంతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

0 comments:
Post a Comment