హైదరాబాద్: తృతీయ ఫ్రంట్‌లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని చంద్రబాబు అనడం పెద్ద జోక్ అని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పగటికలలు కంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు హయాం అంతా కుంభకోణాలమయమేనని, తనపై ఉన్న అవినీతి కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న బాబుకు నిజాయితీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అవినీతిపై చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు.
0 comments:
Post a Comment