Thursday, 16 May 2013

వై.ఎస్ విజయమ్మ ప్రశ్నలు

సిబిఐ ఒక్కొక్కరి విషయంలో ఒక్కోరకమైన ప్రమాణం పాటిస్తున్నదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వ్యాఖ్యానించారు. జగన్ ను జైలులో పెట్టి ఏడాది అయిందని, ఇంకెంతకాలం జైలులో ఉంచుతారని ఆమె ప్రశ్నించారు. షర్మిల రెండువేల కిమీ పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా జరిగినసభలో ఆమె ప్రసంగించారు ప్రధానమంత్రికి ఒక న్యాయం, అక్కడున్న మంత్రులకు ఒక న్యాయం రాష్ట్రంలో వైఎస్సార్‌కు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.రాజీవ్‌గాంధీ చనిపోయిన తర్వాత బోఫోర్స్ కేసులో ఆయన పేరును తీసేశారని, కానీ రాష్ట్రంలో మాత్రం వైఎస్సార్ చనిపోయాక ఆయన పేరును ఎఫ్‌ఐర్‌లో చేర్చారని ఆమె పేర్కొన్నారు.మోపిదేవి, ధర్మాన ప్రసాద్, సబితమ్మ, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, ములాయం కోడలు,ఇలా ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం జరుగుతోందని ఆమె ధ్వజమెత్తుతున్నారు. న్యాయ వ్యవస్థపై విమర్శలు చేస్తే వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విజయమ్మ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపిస్తుంది.నిజానికి న్యాయ వ్యవస్థ కూడా ఈ ప్రశ్నలన్నటికీ సమాధానం చెప్పగలిగితే బాగుంటుంది.

0 comments:

Post a Comment