రావికంపాడు: జగన్‌బాబును జైల్లో పెట్టి ఏడాది అవుతోంది. ఇంక సరిపోలేదా? ఇంకెంత కాలం జైల్లోనే ఉంచుతారు? సీబీఐ ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా విచారణ చేస్తోంది. ఒక్కోక్కరికి ఒక్కొక్క న్యాయం జరుగుతోంది.ప్రధానమంత్రికి ఒక న్యాయం, అక్కడున్న మంత్రులకు ఒక న్యాయం రాష్ట్రంలో వైఎస్సార్‌కు ఒక న్యాయమా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజీవ్ గాంధి బోఫోర్స్‌కేసులో ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తరువాత ఆయన పేరు తీసేశారు. రాష్ట్రంలో మాత్రంలో వైఎస్సార్ చనిపోయాక ఆయన పేరును ఎఫ్‌ఐర్‌లో దోషిగా చేర్చారు.
ఒక మోపిదేవికైతేనేమి,ధర్మాన ప్రసాద్, సబితమ్మ, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, ములాయం కోడలుకు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం జరుగుతోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రం 150 రోజులు, 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రావికంపాడు వద్ద ఏర్పాటు చేసిన 24 అడుగుల వైఎస్సార్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వారు హజరయ్యారు.
0 comments:
Post a Comment