హైదరాబాద్ : తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పదవిలో ఉన్నంతకాలం నిబంధనలకు అనుకూలంగానే జీవోలు ఇచ్చినట్లు ఆమె సోమవారమిక్కడ తెలిపారు. తాను 20 రోజుల క్రితమే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాజీనామా లేఖను ఇచ్చినట్లు పేర్కొన్నారు. నిన్న తాను ఎలాంటి రాజీనామా లేఖ ఇవ్వలేదని సబిత వెల్లడించారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కాగా సబిత నివాసం వద్ద ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా బంద్ కు సబిత మద్దతుదారులు పిలుపునిచ్చారు.
0 comments:
Post a Comment