ముంబయి : నిన్న మొన్నటి వరకూ ఆకాశాన్నంటిన పసిడి ధరలు క్రమక్రమంగా దిగివస్తున్నాయి. బంగారం ధర 23,500 రూపాయలకు వస్తుందని నిన్న పలువురు మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. గతరాత్రి 10 గ్రాముల ధర బాగా కోలుకుంది. ఎంసీక్స్ లో నిన్న ఒక దశలో 24 క్యారెట్ల ధర 25,400 రూపాయలకు వచ్చింది. అలాంటిది రాత్రి ట్రేడింగ్ ముగిసే సమాయానికి ధర 350 రూపాయల నష్టాన్ని పూడ్చుకోవడమే కాకుండా.. మరో 237 రూపాయలు పెరిగి 26 వేల 72 రూపాయల వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో నిన్న ఔన్స్ ధర కనిష్ఠ స్థాయి 40 డాలర్లకు పైగా పెరగడంతో మన మార్కెట్లో పసిడి ధర కనిష్ఠ స్థాయి 600 రూపాయలకు పైగా పెరిగింది. డాలర్ ఇండెక్స్‌లో బలహీనత లేనప్పటికీ అనూహ్యంగా ఔన్స్ బంగారం ధర కోలుకుంది. ప్రస్తుతం 1387 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది.
అయితే 8 రోజులుగా బంగారం ధర పడుతూ రావడం వల్ల ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్ చేశారని ఫలితంగానే ధర పెరిగిందని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. మరో వైపు రూపాయి నిన్న 20 పైసలు నష్టపోవడం కూడా మన మార్కెట్లో బంగారం ధర పెరగడానికి కారణమైంది.
0 comments:
Post a Comment