Tuesday, 14 May 2013

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా


ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 149వ రోజు బుధవారం 12.3 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. టి.నరసాపురం మండలం ముత్యాలంపేట నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర మధ్యాహ్నపు వారిగూడెం చేరుతుందని పేర్కొన్నారు. 

పర్యటించే ప్రాంతాలు
ముత్యాలంపేట, టి.నరసాపురం, గురవాయగూడెం, ఏపుగుంట, శ్రీరామవరం, తిరుమలదేవిపేట, మధ్యాహ్నపు వారిగూడెం 

ఇందులో దిట్టే టిజి వెంకటేష్

రాష్ట్ర చిన్ననీటివనరుల శాఖ మంత్రి టిజి వెంకటేష్ ఎప్పుడో ఏదో ఒక అనవసర ప్రకటన చేయడంలో దిట్ట అనే చెప్పాలి.తాజాగా ఆయన చేసిన ప్రకటన కూడా అటువంటిదే.తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావును హీరోగా పెట్టి తాను ఒక సినిమా తీయడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. సిగరెట్ , మద్యం మానివేసిన కెసిఆర్ ఇప్పుడు ఈ పాత్రకు సరిపోతారని అన్నారు. విజయశాంతి దర్శకత్వంలో ,హరీష్ రావు డైలాగులతో సినిమా తీయడానికి సిద్దమని ఆయన అన్నారు.ఇక ఫైటింగ్ సీన్ లలో కెసిఆర్ కుమారుడు కెటిఆర్ ఉంటారని వెంకటేష్ చెప్పారు.మంత్రికి ఈ ప్రకటన చేయడం ఇప్పుడు అవసరమా!

రేపు టీఆర్‌ఎస్‌లో చేరనున్న కడియం శ్రీహరి

వరంగల్‌: ఇటీవల టీడీపీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత కడియం శ్రీహరి రేపు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణపై చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసిస్తూ టీడీపీకి కడియం శ్రీహరి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

స్థానిక ఎన్నికలకు సిద్ధం: కొణతాల రామకృష్ణ

విశాఖపట్నం: వైఎస్ జగన్ విషయంలో సీబీఐ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. సోనియా అల్లుడుకి ఒక న్యాయమా.. వైఎస్‌ జగన్‌కు ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. డీఎల్‌ఎఫ్‌ కుంభకోణంలో సోనియా అల్లుడిని వెనకేసుకొచ్చి తప్పించిందని అన్నారు. అతిగా ప్రవర్తించే సీబీఐ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. స్థానిక సంస్థలు ఎప్పుడు పెట్టినా వైఎస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉంటుందన్నారు. 

Konda couple vows to continue support to ysrcp- Video

కళంకిత మంత్రులను తొలగించాలి: మాజీ మంత్రి శంకర్రావు

హైదరాబాద్: కేంద్రంలో మాదిరే రాష్ట్రంలోనూ అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు. కళంకిత మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో సీఎం హస్తం ఉందని, ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసువేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మంత్రుల అవినీతితో కాంగ్రెస్‌ శ్రేణులు నీరుగారిపోతున్నాయని అన్నారు.

వైఎస్ కుటుంబం వెంటే ఉంటాం: కొండా సురేఖ


హైదరాబాద్: వైఎస్ కుటుంబం నుంచి విడిపోయే ప్రసక్తిలేదని కొండా సురేఖ చెప్పారు. కొండా మురళీ, సురేఖ దంపతులు జైలులో జగన్ ను కలిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాము ఆ కుటుంబం వెంటే ఉంటామని చెప్పారు. పార్టీపై తనకు అసంతృప్తిలేదని చెప్పారు. తాము పార్టీ మారడంలేదన్నారు. తాము పార్టీ మారుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు.

YSజగన్ ను కలిసిన కొండా దంపతులు

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొండా మురళీ, సురేఖ దంపతులు ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలిశారు. చంచల్ గూడ జైలులో ములాఖత్ సమయంలో వారు జగన్ ను కలిశారు. 

YSజగన్ కేసులో కీలక పరిణామం

జగన్ కేసులో కీలకమైన పరిణామం సంభవించింది.దాల్మియా సిమెంటు చార్జీషీటులో జగన్, విజయసాయిరెడ్డిలపై నమోదైన సెక్షన్లను కోర్టు తోసిపుచ్చింది.420,409, అవినీతి నిరోదక చట్టం కింద నమోదైన సెక్షన్లను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అవినీతి నిరోదక చట్టం కేవలం ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నవారికే మాత్రమే వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జగన్, విజయసాయిరెడ్డిలు ప్రభుత్వంలో పనిచేయలేదు కనుక ఈ చట్టం కింద సెక్షన్లు వర్తించవన్న భావనతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని చెబుతున్నారు.దీనితో ఇంతకుముందు నాలుగు చార్జీషీట్లలో తీసుకున్న రెండు సెక్షన్లను దాల్మియాలో పెట్టకపోవడం వల్ల జగన్,విజయసాయిరెడ్డిలకు కొంత ఊరట కలిగించవచ్చని కొందరు చెబుతున్నారు.శ్రీలక్ష్మి,సబిత, రాజగోపాల్ లపైన ఐపిసి,అవినీతి నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేయగా, జగన్ , విజయసాయిలకు వాటిని వర్తింప చేయలేదు.దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

జగనన్నతోనే వైఎస్ సువర్ణ యుగం :షర్మిల


ఏలూరు: జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ ఆ మహానేత వైఎస్ సువర్ణ యుగం వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. చింతలపూడి రచ్చబండలో ఆమె ప్రసంగించారు. జగనన్న సీఎం అయితే మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండవని చెప్పారు. కరెంట్ చార్జీలు పెంచడమే సంక్షేమమా? ఫీజు రియెంబర్స్‌మెంట్ కు తూట్లు పొడవటమే సంక్షేమమా ? వైఎస్ పథకాలను నీరు గార్చడమే సంక్షేమమా? పేదవారికి ఇళ్లు లేకపోవడమేనా సంక్షేమమంటే? సంక్షేమమంటే పేద విద్యార్థుల బస్ పాస్ సబ్సిడీలు కుదించడమేనా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో కనీసం మూడు గంటలు కూడ కరెంట్ ఉంటడంలేదని చెప్పారు. విద్యార్దుల బస్‌పాస్ చార్జీలు సైత పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్దులపై 3 వందల కోట్ల రూపాయల భారం పడనుంది. వైఎస్ఆర్ ఉన్నప్పడు అందరికీ 7-9 గంటల విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు. కాని కిరణ్ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో నాలుగు సార్లు చార్జీలు పెంచి 30 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై వేసిందన్నారు. వడ్డీ లేని రుణాలు ప్రచారానికి మాత్రమే పరిమితమైందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటి ప్రభుత్వం తీరు కూడా అదే అన్నారు. 

జగనన్న సీఎం అయి రాజన్న రాజ్యం వచ్చాక వికలాంగులు, వృద్ధులకు ప్రతినెల పెన్షన్లు ఇస్తారని చెప్పారు. పేద పాఠశాలల విద్యార్థులకు ప్రతి నెల 500 రూపాయలు, ఇంటర్ విద్యార్థులకు 700, డిగ్రీ విద్యార్థులకు 1000 రూపాయల చొప్పున ఇస్తారని హామీ ఇచ్చారు. చంద్రబాబుకు, కిరణ్ కు బుద్ధి చెబితే రాబోయేది రాజన్న రాజ్యమే అన్నారు.