జగన్ కేసులో కీలకమైన పరిణామం సంభవించింది.దాల్మియా సిమెంటు చార్జీషీటులో జగన్, విజయసాయిరెడ్డిలపై నమోదైన సెక్షన్లను కోర్టు తోసిపుచ్చింది.420,409, అవినీతి నిరోదక చట్టం కింద నమోదైన సెక్షన్లను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అవినీతి నిరోదక చట్టం కేవలం ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నవారికే మాత్రమే వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జగన్, విజయసాయిరెడ్డిలు ప్రభుత్వంలో పనిచేయలేదు కనుక ఈ చట్టం కింద సెక్షన్లు వర్తించవన్న భావనతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని చెబుతున్నారు.దీనితో ఇంతకుముందు నాలుగు చార్జీషీట్లలో తీసుకున్న రెండు సెక్షన్లను దాల్మియాలో పెట్టకపోవడం వల్ల జగన్,విజయసాయిరెడ్డిలకు కొంత ఊరట కలిగించవచ్చని కొందరు చెబుతున్నారు.శ్రీలక్ష్మి,సబిత, రాజగోపాల్ లపైన ఐపిసి,అవినీతి నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేయగా, జగన్ , విజయసాయిలకు వాటిని వర్తింప చేయలేదు.దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.
0 comments:
Post a Comment