Tuesday, 14 May 2013

జగనన్నతోనే వైఎస్ సువర్ణ యుగం :షర్మిల


ఏలూరు: జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ ఆ మహానేత వైఎస్ సువర్ణ యుగం వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. చింతలపూడి రచ్చబండలో ఆమె ప్రసంగించారు. జగనన్న సీఎం అయితే మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండవని చెప్పారు. కరెంట్ చార్జీలు పెంచడమే సంక్షేమమా? ఫీజు రియెంబర్స్‌మెంట్ కు తూట్లు పొడవటమే సంక్షేమమా ? వైఎస్ పథకాలను నీరు గార్చడమే సంక్షేమమా? పేదవారికి ఇళ్లు లేకపోవడమేనా సంక్షేమమంటే? సంక్షేమమంటే పేద విద్యార్థుల బస్ పాస్ సబ్సిడీలు కుదించడమేనా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో కనీసం మూడు గంటలు కూడ కరెంట్ ఉంటడంలేదని చెప్పారు. విద్యార్దుల బస్‌పాస్ చార్జీలు సైత పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్దులపై 3 వందల కోట్ల రూపాయల భారం పడనుంది. వైఎస్ఆర్ ఉన్నప్పడు అందరికీ 7-9 గంటల విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు. కాని కిరణ్ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో నాలుగు సార్లు చార్జీలు పెంచి 30 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై వేసిందన్నారు. వడ్డీ లేని రుణాలు ప్రచారానికి మాత్రమే పరిమితమైందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటి ప్రభుత్వం తీరు కూడా అదే అన్నారు. 

జగనన్న సీఎం అయి రాజన్న రాజ్యం వచ్చాక వికలాంగులు, వృద్ధులకు ప్రతినెల పెన్షన్లు ఇస్తారని చెప్పారు. పేద పాఠశాలల విద్యార్థులకు ప్రతి నెల 500 రూపాయలు, ఇంటర్ విద్యార్థులకు 700, డిగ్రీ విద్యార్థులకు 1000 రూపాయల చొప్పున ఇస్తారని హామీ ఇచ్చారు. చంద్రబాబుకు, కిరణ్ కు బుద్ధి చెబితే రాబోయేది రాజన్న రాజ్యమే అన్నారు. 

0 comments:

Post a Comment