Monday, 29 April 2013

మే 1 నుంచి యధావిధిగా షర్మిల పాదయాత్ర

ఖమ్మం, 29 ఏప్రిల్‌ 2013: మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మే 1వ తేదీ నుంచి యధావిధిగా కొనసాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. పాదయాత్రికురాలు, పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిలకు ఎడమకాలి మడమ నొప్పి ఎక్కువగా ఉన్న కారణంగా మంగళవారం మరో ప్రజాప్రస్థానానికి విరామం ప్రకటించారు. శ్రీమతి షర్మిలకు మంగళవారం కూడా విశ్రాంతి అవసరమని వైద్యులుసూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్ తల‌శిల రఘురాం చెప్పారు.

0 comments:

Post a Comment