హైదరాబాద్ : శుష్క వాగ్దానాలు చేయడం చంద్రబాబుకు కొత్తకాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ఆయన సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీ కోసం వస్తున్న పాదయాత్రలో బాబు చాలానే శుష్క వాగ్దానాలు చేశారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు ఎన్ని వాగ్దానాలు అమలు చేశారని గట్టు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని వాగ్దానాల కోసం పోరాడారన్నారు.
ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం చంద్రబాబుకు అలవాటేనని, మరోసారి ప్రజలను మోసం చేయడానికే ఈ వాగ్దానాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉండగా బాబు కోటి వరాలు అంటూ కోటి మోసాలు చేసింది నిజంకాదా అని ప్రశ్నలు సంధించారు. మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కిలో రెండు రూపాయాల బియ్యం ధరను పెంచారని, మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది కూడా ఆయనేనని అన్నారు. బాబు వాగ్దానాలను ఏ ఒక్కరూ నమ్మరని గట్టు పేర్కొన్నారు.
0 comments:
Post a Comment