న్యూఢిల్లీ : క్విడ్‌ప్రోకో కేసులో విమర్శలు ఎదుర్కొంటున్న సిబిఐ తన ధోరణి మాత్రం మార్చలేదు. నిమ్మగడ్డ ప్రసాద్, విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్లు ఇవ్వాళ కోర్టు ముందుకు రానున్నాయి. కోర్టు ఇచ్చిన నెంబరింగ్ ప్రకారం ఏడో సీరియల్ నెంబర్‌లో ఈ రెండు పిటీషన్లు విచారణకు రానున్నాయి. అయితే ఈలోగానే సిబిఐ తరపు న్యాయవాది ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం ముందు మెన్షనింగ్ మ్యాటర్ ఉంచారు.
అత్యవసర సమయంలో చేయాల్సిన వాదనను మెన్షనింగ్ మ్యాటర్ అంటారు. నిమ్మగడ్డ, విజయసాయిలకు సంబంధించిన పిటిషన్లను మే 7కు వాయిదా వేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బొగ్గు కుంభకోణంకు సంబంధించిన వ్యవహారంలో తలమునకలయి ఉన్నామని, పని ఒత్తిడి వల్ల ఈ కేసును మే 7కు వాయిదా వేయాలని సిబిఐ కోరింది. విచారణకు రాకముందే కేసును ఎలా వాయిదా వేయమంటారని ప్రశ్నించిన కోర్టు పిటిషన్ బెంచ్‌పైకి వచ్చినప్పుడు పరిశీలిస్తామని తెలిపింది.
0 comments:
Post a Comment