న్యూఢిల్లీ : తెలంగాణ ఉద్యోగ సంఘాలు మంగళవారం సోనియాగాంధీ నివాసం ముట్టడికి యత్నించారు. సోనియా నివాసంలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించిన టీ జాక్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే సోనియాకు వినతిపత్రం ఇచ్చేందుకు మాత్రం అనుమతించారు. పోలీసుల అనుమతితో టీ జాక్ నేత శ్రీనివాస్ గౌడ్ వినతపత్రం సమర్పించి వెనుదిరిగారు. మరోవైపు ఏఐసీసీ కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ముట్టడించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
0 comments:
Post a Comment