న్యూఢిల్లీ: పెట్రోలు ధర లీటర్‌కు మూడు రూపాయలు తగ్గిస్తూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన పెట్రోల్ ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో తాజా ధర 69 రూపాయలుగా ఉండే అవకాశముంది. గత ఎనిమిది నెలల్లో ఇదే అత్యల్ప ధరగా నమోదైంది. మార్చి 2 తేదితో పోలిస్తే పెట్రోలుధర లీటరకు ఎనిమిది రూపాయలు తగ్గింది. హైదరాబాద్‌లో మార్చి 2 తేదిన లీటరు పెట్రోలు ధర 77.12 రూపాయలుగా ఉంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలోనే పెట్రోల్ ధరను తగ్గించిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తగ్గిన ధర ప్రకారం ఢిల్లీలో 66.09, కోల్ కతా 73.48, ముంబై 72.88, చెన్నైలో 69.08 గా ఉంటుంది.
0 comments:
Post a Comment