Tuesday, 30 April 2013

చంద్రబాబును జనం నమ్మరు: బొత్స సత్యనారాయణ


హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు యాత్ర... 'వస్తున్న నాకోసం' అంటూ సాగిందని ఎద్దేవా చేశారు. బొత్స మంగళవారం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బెల్టు షాపులపై చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ మద్య నిషేదాన్ని విధిస్తే చంద్రబాబు దాన్ని ఎత్తివేశారని, ఇప్పుడు బెల్ట్‌ షాపులను ఎత్తివేస్తామంటున్న బాబును జనం నమ్మరన్నారు. వడ్డీలేని రుణాలంటూ కొత్తగా మాట్లాడుతున్నారని, పథకాల పేరుతో బాబు ప్రజలను మోసం చేస్తున్నారని బొత్స విమర్శించారు.

ప్రబుత్వ పథకాల అమలులో అలసత్వం ఉన్నమాట వాస్తవమేనని బొత్స అంగీకరించారు. ఇంకా కొన్ని హామీలను కాంగ్రెస్ నెరవేర్చాల్సి ఉందన్నారు. జగన్ బెయిల్ అంశంపై కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. వైఎస్‌ఆర్ హయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు న్యాయస్థానంలో రుజువైతే కాంగ్రెస్‌ కూడా తలదించుకోవల్సిందేనని బొత్స వ్యాఖ్యానించారు.

0 comments:

Post a Comment