సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తీ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ పై రాజకీయ జోక్యం ఉండరాదని, అలా ఐతే సీబీఐ పై ప్రజలలో గౌరవం తగ్గుతుందని కూడా సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. బొగ్గు కుంభకోణం కేసులో సుప్రీంకోర్టుకు ఇవ్వవలసిన నివేదికను ప్రభుత్వానికి సీబీఐ ఇవ్వడం పై కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనివల్ల కేసు బలహీనపడుతుందని చెప్పింది. దర్యాప్తు సంస్థలో రాజకీయ జోక్యం సరికాదని తేల్చి చెప్పింది. సీబీఐకి స్వయం ప్రతిపత్తి పునరుద్దరణకు కృషి చేస్తామని కోర్టు వ్యాఖ్యానించడాన్ని ప్రజాస్వామ్యవాదులు హర్శిస్థున్నరు. కాగా సీబీఐ తీరుతెన్నులపై, స్వతంత్ర ప్రతిపత్తిపై పలువురూ పలు రకాలుగా అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, సీబీఐని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటున్న దన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపణలకు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు బలపరిచాయీ. జగన్ కేసులో నిందితుడుగా ఉన్న విజయసాయీ రెడ్డి ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి సుప్రీమ్ కోర్టు లో పిటిషన్ వేసి ఉన్నారు.
0 comments:
Post a Comment