న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పును సుప్రీంకోర్టు రిజ్వర్ లో ఉంచింది. సుదీర్ఘ వాదనల అనంతరం బెయిల్‌పై నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. వాన్ పిక్‌కు 18 వేల ఎకరాలు అభివృద్ధికోసం కేటాయించారని, గతంలో చంద్రబాబుకూడా ఇలాంటి భూకేటాయింపులు జరిపారని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు.
పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయింపులు జరిపిందని, దీనికి క్విడ్ ప్రోకో అంటగడుతున్నారని హరీష్ సాల్వే వాదించారు. సీబీఐ అభియోగాల్లో పసలేదని, బాబు చేసిన కేటాయింపులపై నోరుమెదపట్లేదన్నారు. మరో వైపు కేసు వివరాలను కోర్టుకు తెలిపిన సిబిఐ, ఈ కేసులో తుది ఛార్జిషీటు దాఖలు చేయటాకిని 4 నుంచి 6 నెలల సమయం కావాలని తెలిపింది. విచారణ పూర్తి అయ్యాకే తుది ఛార్జ్ షీట్ వేస్తామని స్పష్టం చేసింది. కాగా ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
0 comments:
Post a Comment