హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి 2009 సాదారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీచేసిన డాక్టర్ కుడిపూడి శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం శ్రీనివాస్‌తో పాటు వచ్చిన టీడీపీ నేత డాక్టర్ ఎ.సాంకత్యాయన్‌లకు వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలకమండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు ఎంఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment