‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతోనే వైఎస్సార్‌సీపీ ఏర్పడినప్పటి నుంచి పార్టీలో ఉన్నాను. పార్టీ నుంచి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. వైఎస్సార్‌సీపీ నాకు పుట్టినిల్లు లాంటిది. వైఎస్‌తో, ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం విడదీయనటువంటిది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తాను అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కాదని, కాంగ్రెస్ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నా అవేమీ పట్టించుకోకుండా ఆ పార్టీని వదిలేసినట్లు తెలిపారు. తాను బ్యాక్‌డోర్ నుంచి వచ్చిన నాయకుడిని కాదని, పోరాటాలు చేసి పైకొచ్చానని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాగుండాలని కోరుకునే వారిలో తాను ముందున్నానని, జగన్ సీఎం కావాలని, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు.
0 comments:
Post a Comment