Wednesday, 8 May 2013

వైఎస్ హయాంలో రైతు రాజుగా మారాడు: YS షర్మిల


ఖమ్మం: ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ.. వ్యవసాయం దండగ అన్న ఘనత చంద్రబాబుదేనని షర్మిల మండిపడ్డారు. ప్రాజెక్టులు కడితే నష్టం అని బాబు వ్యవసాయాన్ని నీరుగార్చారని షర్మిల ఆరోపించారు. చందుగొండ మండలం ఎర్రగుంటలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ.. చంద్రబాబు తన హయాంలో రైతులను పురుగుల్లా చూశారు అని అన్నారు. వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చాకే రైతు రాజుగా మారాడని షర్మిల తెలిపారు. 
ఒక్క ఖమ్మం జిల్లాలోనే వైఎస్ఆర్ గిరిజనులకు 2లక్షల ఎకరాల అటవీభూములపై హక్కు కల్పించిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. మహానేత వైఎస్ బతికుంటే ఈ జిల్లాలోనే మరో 6లక్షల ఎకరాలపై హక్కు పత్రాలు ఇచ్చేవారని షర్మిల తెలిపారు. వైఎస్‌ఆర్ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను కిరణ్‌ సర్కార్ అటకెక్కించిందని.. ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది..ఇక పక్కా ఇళ్లకు ఏకంగా పాడి కట్టేశారని షర్మిల ధ్వజమెత్తారు. కిరణ్ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంపునకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నాడని షర్మిల విమర్శించారు. వైఎస్‌ఆర్‌కు ప్రజల్లోని విశ్వసనీయత జగనన్నకు కూడా ఉందని ప్రజల నమ్మకమని షర్మిల అన్నారు. 

0 comments:

Post a Comment