వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఆయన అభిమానులకు ఆశలు పెరుగుతున్నాయి.ప్రత్యేకించి బొగ్గు కుంభకోణం, ఇతర కేసులలో సిబిఐపై సుప్రింకోర్టు తీవ్రంగా మండిపడ్డ నేపధ్యంలో జగన్ కు బెయిల్ రావచ్చని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలు ఆశిస్తున్నారు.ఆయా కేసులలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై సుప్రింకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.సిబిఐ పంజరంలో చిలకలా మారిందని వ్యాఖ్యానించడం సంచలనంగానే ఉంది.ఆయా కేసుల దర్యాప్తులలో అదికారులతో సంప్రదించవలసిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అవసరమైతే వారిని ప్రశ్నించవచ్చని తెలిపింది.ఇలాగ పరిస్థితి కొనసాగితే.సిబిఐ ప్రతిపత్తి విషయంలో కోర్టు చర్యలు తీసుకోవలసి వస్తుందని కూడా సుప్రింకోర్టు కూడా హెచ్చరించింది.న్యాయశాఖ మంత్రి సలహా మేరకే ఆయన వద్ద సమావేశం నిర్వహించామని సిబిఐ తెలిపింది.జగన్ కేసులో కూడా పిబిఐ రాజకీయ ప్రేరితంగా చేస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.జగన్ తరపు న్యాయవాదులు దీనిపై వాదించారు. సరిగ్గా సుప్రింకోర్టు కూడా సిబిఐని మందలించిన తరువాత ఒకటి,రెండు రోజులలో జగన్ కేసు తీర్పు వచ్చే అవకాశం ఉంది.అందువల్ల వారు జగన్ కు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నారు.
0 comments:
Post a Comment