నాగర్ కర్నూల్ నుంచి కిందటిసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన జెసి బ్రదర్స్ యజమాని మర్రి జనార్ధనరెడ్డి టిఆర్ఎస్ లో చేరుతున్నారు.ఆయన బిజెపిలో చేరతారేమోనని ప్రచారం జరిగింది. కాని కేశవరావు, మందా జగన్నాధం,వివేక్ తదితరులతో పాటు ఆయన కూడా టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.కాగా తాము ఎలాంటి పదవులు ఆశించడం లేదని కేశవరావు చెప్పారు.అయితే ఆయన కుమారుడు విప్లవ్ కుమార్,మందా జగన్నాధం కుమారుడు శ్రీనాధ్ కూడా కేశవరావు ఇంటివద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.కాగా టిడిపి మాజీ ఎమ్.పి మాణిక్ రెడ్డి కూడా టిఆర్ఎస్ లో చేరుతుండడం విశేఫం.అలాగే భువనగిరి లోక్ సభ స్థానాన్ని ఆశిస్తున్న నరసయ్య గౌడ్ కూడా టిఆర్ఎస్ లో ప్రవేశిస్తున్నారని కధనం.కాగా ఇదే సీటుపై దృష్టి పెట్టుకున్న టిఆర్ఎస్ నేత శ్రావణ్ భవిష్యత్తు ఏమిటో తెలియాల్సి ఉంది.
0 comments:
Post a Comment