తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న సీనియర్ కాంగ్రెస్ నేత కె.కేశవరావు,ఎమ్.పిలు మందా జగన్నాధం,వివేక్ లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని తేలిపోయిందని ప్రకటించారు.అందువల్లనే తాము కాంగ్రెస్ ను వీడుతున్నామని చెప్పారు.ఇంతవరకు బాగానే ఉంది.తాము ఉద్యమానికి ప్రతిరూపంగా ఉన్న టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.అయితే ఇంతవరకు ఒకేగాని, కొందరు ఇతర పక్షాల నేతలు అడుగుతున్నట్లుగా టిఆర్ఎస్ లో చేరితే తెలంగాణ ఎలా వస్తుందన్నదానికి కేశవరావు వంటి నేతలు సమాధానం సమర్ధంగా చెప్పగలిగితే బాగుంటుంది.ఎందుకంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను కాదని అంటున్నారు. ఒకే.అదే సమయంలో తాము బిజెపితో పొత్తు పెట్టుకోబోమని టిఆర్ఎస్ ప్రకటించింది. అలాంటప్పుడు బిజెపితో కూడా వీరు కలవబోరు.ఈ రెండు పార్టీల ప్రమేయం లేకుండా తెలంగాణ ఎలా వస్తుందన్నదానిపై కేశవరావు బహుశా భవిష్యత్తులో వివరణ ఇస్తే బాగుంటుంది.
0 comments:
Post a Comment