Thursday, 30 May 2013

వరంగల్ ఎమ్.పి దారెటు

వరంగల్ కాంగ్రెస్ ఎమ్.పి సిరిసిల్ల రాజయ్య దారి ఎటు అన్నది చర్చనీయాంశంగా మారింది. జూన్ నెల రెండో తేదీలోగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆయన కూడా చేరవచ్చని పార్టీ వర్గాలు ఆశిస్తుండగా,భారతీయ జనతా పార్టీ కూడా ఆయనపై కన్నేసింది.తమ పార్టీలో చేరవలసిందిగా ఆ పార్టీ నాయకత్వం కోరగా చూద్దాం అని మాత్రమే ఆయన సమాధానం ఇచ్చారు. వరంగల్ స్థానాన్ని కడియం శ్రీహరికి ఇవ్వవలసి ఉన్నందున మానకొండూరు అసెంబ్లీని రాజయ్యకు టిఆర్ఎస్ ఆఫర్ చేసిందని అంటున్నారు.దానికి రాజయ్య అసంతృప్తి చెందారు.ఈ నేపధ్యంలో రాజయ్య బిజెపి ఆఫర్ ను స్వీకరిస్తారా?టిఆర్ఎస్ లోకి వెళతారా?కాంగ్రెస్ లోనే ఉంటారా అన్నది తేలవలసి ఉంది.

0 comments:

Post a Comment