అయినప్పటికీ ఆయన...కష్టాల్నే ఎంచుకున్నారు కానీ,కాంగ్రెస్‌ను ఎంచుకోలేదు!
రాష్ట్ర ప్రజలకు నాలుగేళ్లుగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వారు ఎంతగానో అభిమానించే ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డిగారు అకస్మాత్తుగా ఈ లోకం విడిచివెళ్లిపోయారు. ఆ బాధలో ఉండగానే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్! మరోవైపు రాష్ట్రంలో నానాటికీ అధ్వానంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు. ఈ తరుణంలో రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక ఆశాజ్యోతి జగన్... దాదాపు ఏడాదిగా నిర్బంధంలో ఉన్నారు. ఓదార్పుయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యల్ని తెలుసుకుంటున్న సమయంలో జగన్‌ని అరెస్ట్ చేయడం బాధాకరం. జగన్ కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే ఇన్ని కష్టాలు మీద పడేవి కావేమో. అయినప్పటికీ ఆయన కష్టాల్నే ఎంచుకున్నారు కానీ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్‌పార్టీని కాదు.
అన్ని పార్టీలు, ఆ పార్టీలలోని కుటిల నాయకులు జగన్‌ని ఒక్కడిని చేసి వేధిస్తున్నాయి. అయితే ఆ వేధింపులను జగన్ ఎంతో హుందాగా ఎదుర్కొంటున్నారు. పాలక, ప్రతిపక్షాలు ఒక వాస్తవం తెలుసుకోవాలి. ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్న జగన్‌ని ఈ అవరోధాలు, నిర్బంధాలు ఏమీ చేయలేవు. జగన్ స్థాపించిన వైయస్‌ఆర్‌సీపీ ప్రజలకు అండగా ఉంది. ప్రజలూ ఆయనకు అండగా ఉన్నారు. ఏ కుటిల రాజకీయాలూ తెలియని జగన్‌ను ఒక్కడిని చేసినా... ప్రజలు తమ కన్నబిడ్డలా, అన్నలా, తమ్ముడిలా చూసుకుంటున్నారు. జగన్‌లా పూర్తిగా ప్రజల పక్షానే ఉండే ధైర్యం ఇవాళ మన రాజకీయనాయకులకు ఉందా? అలాగే ప్రజల్లో మాకు ఆదరణ ఉందని ఒక్క నాయకుడైనా చెప్పుకోగలడా? ఎన్ని వేధింపులకు గురి చేసినా జగన్‌ను ప్రజలకు దూరం చేయలేరు. ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ప్రజలకు దగ్గర కాలేదు.
0 comments:
Post a Comment