శాసనసభలో స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవుల విషయంలో గతంలో టిఆర్ఎస్ చేసిన విమర్శనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కూడా చేసింది. కాంగ్రెస్ , టిడిపి లు ఛైర్మన్ పదవులను పంచుకున్నాయని ఆ పార్టీ ఆరోపించింది.తగు సంఖ్యాబలం ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛైర్మన్ పదవి కూడా ఇవ్వకపోవటం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బడ్జెట్ స్టాండింగ్ కమిటీల ఛైర్మన్ పదవులను కాంగ్రెస్-టీడీపీలు పంచుకున్నాయని విమర్శించారు.దీని గురించి స్పీకర్ కు కూడా చెప్పానని అన్నారు. కాగా చిరంజీవి కుమారుడు తేజ విసయంలో పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
0 comments:
Post a Comment