సిబిఐ డైరెక్టర్ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కనిపిస్తుంది.బొగ్గు కుంభకోణం వ్యవహారంలో సుప్రింకోర్టు ఆదేశం మేరకు తయారైన నివేదికను ముందుగానే ప్రభుత్వంలోని పెద్దలకు చూపించిన విషయంపై ఇప్పుడు డైరెక్టర్ రంజిత్ సిన్హా కోర్టు క్షమాపణ కోరారు.
పీఎంఓ జేఎస్ శతృఘ్నసిన్హా నివేదిక చూశారని కోర్టుకు సిబిఐ తెలిపింది. బొగ్గు మంత్రిత్వశాఖ జేఎస్ ఏకే భల్లా కూడా నివేదిక చూశారని, ముసాయిదా నివేదికను మాత్రమే చూపామని సిబిఐ తెలిపింది. విచారణ స్థితిని తెలిపే నివేదికను మాత్రం చూపలేదని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి నిందితుల, పేర్లను తొలగించలేదని వివరించింది.అయితే నివేదికలో మార్పులు చేర్పులు ఎవరినుద్దేశించి చేశారో ఇప్పుడు చెప్పలేమని పేర్కొనడం విశేషం.అయితే బొగ్గు కుంభకోణంపై నిష్పాక్షికంగా విచారణ చేస్తామని సిబిఐ హామీ ఇవ్వడం కొసమెరుపు.
0 comments:
Post a Comment