హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కండువా కప్పి ఆయనను విజయమ్మ పార్టీలోకి ఆహ్వానించారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన కూన శ్రీశైలంగౌడ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కార్పొరేటర్ రావుల శేషగిరి తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు.
0 comments:
Post a Comment