న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ విమర్శించారు. గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ ఉనికి లేకుండా చేస్తామని హెచ్చరించారు. టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో విఫలమైయ్యాయన్నారు. తెలంగాణ ఉద్యమ ఐక్యత మున్ముందు కూడా కొనసాగుతుందని చెప్పారు. త్వరలోనే ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
0 comments:
Post a Comment