హైదరాబాద్: వైఎస్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ జారీ చేసిన లీగల్ నోటీసు మంత్రికి చేరిందని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు కె.శివకుమార్ తెలిపారు. తనకు లీగల్ నోటీసు అందలేదని మంత్రి ఆనం మీడియాతో చెప్పడంపై శివకుమార్ స్పందిస్తూ.. మంత్రికి లీగల్ నోటీసులు అందినట్లు వచ్చిన అక్‌నాలెడ్జ్‌మెంట్ ప్రతులను పత్రికలకు విడుదల చేశారు.
0 comments:
Post a Comment