సికింద్రాబాద్: అడ్డగుట్ట రచ్చబండలో తమ బాధలు చెప్పుకున్న ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధైర్యం చెప్పారు. జగన్ వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తారని, అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడం ఈ రచ్చబండ ఉద్దేశమని చెప్పారు. పథకాలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకోవడానికే పార్టీ ఈ రచ్చబండను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీరుతాయని చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తే వృద్ధులకు 700 రూపాయల పించన్ ఇస్తారన్నారు. కార్మికులందరికీ విజయమ్మ మేడ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ సీపీ పేరులోనే శ్రామికులను చేర్చామని చెప్పారు. ఈ ప్రభుత్వం పాలనలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యుత్ కోతలతో ఫ్యాక్టరీలు మూత పడటంతో 20 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండేళ్లుగా కుంటుపడుతున్నాయని బాధపడ్డారు.
వైఎస్ కుటుంబాన్ని వేధించడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఏ ప్రాతిపదికన ఈసీజీ కార్ల కంపెనీకి పెట్టుబడికి మించి రాయితీలు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రప్పించినట్లు, లక్ష మందికిపైగా ఉపాధి కల్పించినట్లు కిరణ్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. అన్ని పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయని, కనీసం ఒక్కరికైనా ప్రభుత్వరంగంలో ఉపాధి కల్పించారా? అని ఆమె ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు పెంచారని, ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయాలని చూశారన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకులు రాష్ట్రంలో రావాలసిన అవసరం ఉందని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు 50 ప్రభుత్వ రంగ సంస్థలను టీడీపీ నేతలకు దారాదత్తం చేశారని చెప్పారు. దాంతో వేలాది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు..
0 comments:
Post a Comment