జగన్ అరెస్టుకు సీబీఐ చెప్పిన కారణం... ‘జగన్ ఒక ఎంపీ. ఒక పార్టీ అధ్యక్షుడు. బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడు’ అని! ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడని తెలిస్తే, సాక్ష్యాలు దొరికాక అరెస్ట్ చేస్తారు. కానీ సీబీఐ లాంటి సంస్థ ఏమంటోందంటే, ‘జగన్ తప్పు చేశాడని అనుమానం ఉంది. దానిని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నాం. అవి నిరాటంకంగా సాగాలంటే ముందు జగన్‌ను అరెస్ట్ చేయాలి’ అని!! సీబీఐ చెప్తున్న కారణం ఎంత సిల్లీగా ఉందంటే, రేపు ఒక సామాన్యుణ్నీ ఇదే కారణంతో అరెస్ట్ చేసినా, ఎవరూ ప్రశ్నించే పరిస్థితి ఉండదు. అరెస్ట్ చేసినప్పుడు ఇదే మాట, అరెస్ట్ అయ్యి పది నెలలు దాటినా ఇదే మాట.
ఇలా ఒక వ్యక్తిని జైల్లో ఉంచటం న్యాయమా?
భారతదేశంలో ఇది ఒక పెద్ద కుట్ర. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయటానికి కేసులు పెట్టడం, బెదిరించటం, మాట వినకపోతే అరెస్ట్ చేయటం, ఇంకా మాట వినకపోతే బెయిల్ రాకుండా చూడటం! అధికారంతో ఇన్ని పనులు చేయగలిగిన వ్యవస్థ మన ప్రజాస్వామ్యంలో ఉందంటే ఎంత ఘోరం. ఎన్ని తప్పులు చేసినా అధికారపక్షం మాట వింటే అరెస్టులు ఉండవు. బయటకొచ్చినా, దాని గురించి సీబీఐ విచారణ ఉండదు. అధికార పార్టీకి చెందిన ఎవరినీ సీబీఐ అరెస్ట్ చేయదు.
ఒక 2జీ స్కామ్, కోల్ స్కామ్... ఏదైనా ఇదే వరుస.ఎన్నో కేసులు చూశాం. అన్నింటిలో బలవంతునికి ఒక న్యాయం, బలహీనునికి ఒక న్యాయం. అధికారంలో ఉన్న వ్యక్తికి ఒక న్యాయం, లేని వ్యక్తికి ఒక న్యాయం. అధికారంలో ఉన్న వ్యక్తి ఇన్ని వ్యవస్థలను ప్రభావితం చేయగలిగితే, ఆ వ్యక్తి ఒకవేళ చెడ్డవాడైతే దేశానికి ఎంత నష్టమో గమనించాలి. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు దీన్ని ప్రశ్నించాలి. ధైర్యంగా వ్యతిరేకించాలి. అధికారంలో ఉన్న వ్యక్తికి తన పరిధి ఏంటో చూపించాలి.
అదే పని చేస్తున్న వ్యక్తి వై.ఎస్.జగన్‌గారు. భయపెట్టినప్పుడు లొంగలేదు. అరెస్ట్ చేసినప్పుడు కుంగిపోయి వారి మాట వినలేదు. బెయిల్ రాకుండా ఉన్నా తొణకలేదు. ఇలాంటివారే నిజమైన నాయకుడు. వీరే ప్రజలకు మంచి చేయటం కోసం ధైర్యంగా ముందుకు సాగగలరు. ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా దేశాన్ని కాపాడగలరు.అధికారంలో ఉన్న వ్యక్తి తనకు అధికారాన్ని అందించిన ప్రజలను తప్ప అన్ని వ్యవస్థలనూ తనకు అనుకూలంగా మార్చుకోగలడు. ప్రజల మన్ననలు పొందాలంటే మాత్రం, వారి కష్టాలను తీర్చాలి, ఆకాంక్షలను నెరవేర్చాలి. వారి మనసును అర్థం చేసుకోవాలి. అది సాధ్యమయ్యేది ఒక్క వైఎస్సార్‌కి, తర్వాత జగన్‌కు మాత్రమే.
కాంగ్రెస్ పార్టీ జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తోంది... జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని కాదు, ప్రజల మనసులను ప్రభావితం చేస్తాడని! ప్రజలకు నిజమేంటో చెబుతాడని! జగన్ సాక్ష్యులను తారుమారు చేస్తాడని కాదు. కాంగ్రెస్, టీడీపీ ఆశలను తలకిందులు చేస్తాడని!ఒకసారి ఆలోచిద్దాం, జగన్ ఒకవేళ ఈ అరెస్టులకు భయపడి, ఇవన్నీ మనకెందుకు, కామ్‌గా మనపని మనం చేసుకుపోదాం అనుకొనుంటే, ఆయన ఎప్పుడో కేంద్రమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు.
కానీ ప్రజలకు మేలుచేసే ఒక్కొక్క పథకం కాంగ్రెస్ ప్రభుత్వం తీసేస్తుంటే సహించలేకపోయాడు. బాగుపడిన పేదవాడి జీవితాన్ని ఛిద్రం చేసే కాంగ్రెస్ ఆలోచనలను సహించలేకపోయాడు. అందుకే ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఎదిరించాడు. పర్యవసానం... జైల్లో ఉన్నాడు. మనకోసం ఆయన జైలుకెళ్తే మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం?
మనం నోరుతెరిచి, ‘మా సమస్యలను పరిష్కరించే నాయకుణ్ని జైల్లో ఉంచి మీరు పరిపాలించొద్దు. రాజకీయ ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోండి. కేసులు పెట్టి కాదు. ఇక్కడ ప్రజలు తమకు మేలుచేసిన నాయకుడిని ఎప్పుడూ మరిచిపోరు’ అని చెబుదాం.
కాంగ్రెస్ పార్టీ జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తోంది... జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని కాదు, ప్రజల మనసులను ప్రభావితం చేస్తాడని! ప్రజలకు నిజమేంటో చెబుతాడని! జగన్ సాక్ష్యులను తారుమారు చేస్తాడని కాదు. కాంగ్రెస్, టీడీపీ ఆశలను తలకిందులు చేస్తాడని!
0 comments:
Post a Comment