Saturday, 11 May 2013

ప్రభుత్వంపై శంకరరావు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ప్రభుత్వంపై మాజీ మంత్రి శంకర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రుల మాదిరే రాష్ట్రంలోనూ అవినీతి మంత్రులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పదవి నుంచి తప్పించాలని ఆయన అన్నారు. వెంటనే సీఎల్ పి సమావేశం నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ పనితీరు, సీఎం వ్యవహారశైలి, అవినీతి మంత్రుల అంశాలపై సమావేశంలో చర్చించాలన్నారు. వీటిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పారు. ఈ విషయంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాస్తానన్నారు. ఇదే మంత్రి మండలి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తప్పదని హెచ్చరించారు. సీఎం, కొందరు మంత్రులను తప్పిస్తేనే రాష్ట్ర కాంగ్రెస్ కు భవిష్యత్ ఉంటుందని చెప్పారు. 

0 comments:

Post a Comment