Saturday, 11 May 2013

కిరణ్ కుమార్ రెడ్డిపై ఏ సీనియర్ మాట వినాలో

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆర్టీసి చైర్మన్ , మాజీ మంత్రి ఎమ్.సత్యనారాయణరావు మండిపడ్డారు.కిరణ్ తన ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కిరణ్ సీనియర్లను కలుపుకుని పోవడం లేదని అన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే కాంగ్రెస్ గెలుపు అసాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో ఎవరు సీనియర్లో, ఎవరు జూనియర్లు అన్నది తేల్చడమే కష్టం.పైగా అందులో ఏ సీనియర్ ను విశ్వాసంలోకి తీసుకోవాలి? ఎవరిని తీసుకోరాదన్నది తేల్చుకోవడం అంత తేలిక కాదు.ఇలా సీనియర్లుగా చెబుతున్న కొందరు రోశయ్య ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఏవేవో సలహాలు ఇచ్చి, ఆయనను గందరగోళంలో పడేశారు.రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారు. కాంగ్రెస్ లో సీనియర్లు అంటే ప్రమాదం అన్న సంగతిని కిరణ్ గ్రహించారో, ఏమో కాని ఆయన ఈ తరహా సీనియర్లతో జాగ్రత్తగానే ఉంటున్నట్లున్నారు. అయితే అదే సమయంలో ఆయన తన మంత్రివర్గంలోని పలువురుతో కూడా అంతంత మాత్రం సంబంధాలు కొనసాగించడం, కొందరు ఎమ్.పిలతో విబేధాలు రావడం వంటివాటివల్ల ఇబ్బంది పడుతున్నారు.

0 comments:

Post a Comment