కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ ఏదో ఒకటి కెలుకుతూ ఉంటారు. ఆయన ఏదో ఒకటి మాట్లాడకపోతే ఆయనకు తోచదు. అందులోను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన వ్యాఖ్యలు చేసి ఎప్పుడూ వార్తలలో ఉండాలని కోరుకుంటారు. ఆ క్రమంలో ఆయన ఏదైనా మాట్లాడుతుంటారన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ వాదం మూలనపడిందని మంత్రి వ్యాఖ్యానించారు. సమైక్యవాదం స్థానికంగా బలపడిందని చెప్పారు. ఇది సీమవాసుల ఘనతే అని చెప్పారు. అక్కడితే ఆగారు.ఇంకా నయం.ఇదంతా తన ఘనతే అని చెప్పుకోలేదు.నిజానికి తెలంగాణవాదం మూలన పడిందని అనుకోవడం భ్రమ. అంతేకాక,ఒకవేళ ప్రజలలో దాని గురించి ఆలోచన తగ్గినా టిజి వెంకటేష్ లాంటి నేతల వ్యాఖ్యలతో అది మరింత పుంజుకునే ప్రమాదం ఉంది.కనుక టిజి వెంకటేష్ ఇలాంటి విషయాల జోలికి వెళ్లకుండా కట్టడిచేయగలిగేది ఎవరు?
0 comments:
Post a Comment