కేంద్ర మంత్రి చిరంజీవి తన కుమారుడు చరణ్ పై వచ్చిన దాడి ఆరోపణలపై తాను మాట్లాడేదేముందని వ్యాఖ్యానించారు.ఆ ఘటనపై చరణ్ తన తప్పేమీ లేదని వివరణ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.గత ఆదివారం చరణ్ బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ ఒకటిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో గొడవ పడడం,సెక్యూరిటి సిబ్బంది వారిని కొ్ట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.తాజాగా వచ్చిన కదనాల ప్రకారం దాడి చేసిన సిబ్బంది రాష్ట్ర నిఘావిభాగానికి చెందినవారుగా తేలింది. కేంద్ర మంత్ర భద్రతకోసం ఏర్పాటైన వారు ఆయన కుమారుడు తరపున దారిపోయేవారిపై దాడి చేయడం ఏమిటన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై చిరంజీవి తన కుమారుడు తప్పు చేసి ఉంటే తాను కూడా కోప్పడతానని చెప్పి ఉంటే బాగుండేది.అలాగే జరిగినదానికి చింతిస్తున్నానని అని ఉంటే ఆయనకు మరింత పెద్దరికం వచ్చేది.కాని చిరంజీవికి పుత్ర ప్రేమ ఎక్కువేమో కాని ఆయన తన కుమారుడు ఇచ్చిన వివరణతో తప్పేమీ జరగలేదని భావిస్తున్నారని అనుకోవాలి.
0 comments:
Post a Comment