Saturday, 11 May 2013

నేను పార్టీ మారుతున్నట్లు ఎవరు చెప్పారు

తాను పార్టీ మారుతున్నట్లు ఎవరు చెప్పారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు.కాంగ్రెస్ వారు కలలు కంటుంటే తానేమీ చేయగలనని అన్నారు. వారు ఇష్టం వచ్చినట్లు తీర్మానాలు చేసుకుంటుంటే తనకు పోయేదేమిటని కొణతాల కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు. స్థానిక ఎన్నికలలో జగన్ ప్రచారం చేయకుండా ఉండడం కోసమే బెయిల్ రాకుండా చేశారని ఆయన ఆరోపించారు. దాడి వీరభద్రరావు గురించి అడిగిన ప్రశ్నలకు స్పందించడానికి ఆయన సుముఖత వ్యక్తం పరచలేదు.

0 comments:

Post a Comment