Saturday, 11 May 2013

మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ మళ్లీ పార్టీ మారతారా!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ కూడా పార్టీ మారతారా? దీనిపై కదనాలు వస్తున్నాయి. ఆమదాల వలస నుంచి ఐదు సార్లు శాసనసభకు ఎన్నికైన సీతారామ్ గతంలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి తిరిగి టిడిపిలోకి వచ్చారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.విశాఖలో జరిగిన పాదయాత్ర ముగింపు సభకు కూడా రాలేదు. దీంతో ఆయన కూడా పార్టీలో ఉంటారా?ఉండరా అన్న చర్చ జరుగుతోంది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి వెళ్లే విషయమై ఆయన తర్జనభర్జన పడుతున్నారు.అయితే ఆ పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాలేదని అందువల్లనే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా టిడిపికి ఇలాంటి వలసల ప్రచారం కొంత నష్టం చేస్తుంది.

0 comments:

Post a Comment